Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

నేడు దిల్లీకి జగన్‌… మోదీ, అమిత్‌ షాలతో భేటీ కానున్న సీఎం

సాయంత్రం దిల్లీకి వెళ్లనున్న జగన్‌
రేపు మోదీ, అమిత్‌ షాలతో భేటీ కానున్న సీఎం
విశాఖ నుంచి పాలనపై సమాచారం ఇచ్చే అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో జగన్‌ భేటీ కానున్నారు. జగన్‌ ఉన్నట్టుండి హస్తినకు బయల్దేరనుండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి దిల్లీ పెద్దలకు జగన్‌ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండిరగ్‌ బకాయిలు, రాష్ట్ర సమస్యలను మోదీ, అమిత్‌ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. కొందరు కేంద్ర మంత్రులతో కూడా జగన్‌ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img