Friday, June 9, 2023
Friday, June 9, 2023

నేను ప్రజలను నమ్ముకున్నా..

వాళ్లు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులను నమ్ముకున్నారు

చంద్రబాబు, పవన్ లపై జగన్ విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. దత్త తండ్రి, దత్త పుత్రుడు అంటూ మండిపడ్డారు. తాను మంచిని, ప్రజలను నమ్ముకున్నానని, ఏ మంచీ చేయని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు మాత్రం పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులను నమ్ముకున్నారని ఆరోపించారు.బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా ఐదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను ఈ రోజు సీఎం విడుదల చేశారు. బటన్‌ నొక్కి రూ.231 కోట్లను 1,23,519 మత్స్యకార కుటుంబాల అకౌంట్లలో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తన ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి గతంలో పాలన చేసినవాళ్లు.. వారికి మద్దతు ఇస్తున్న వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెప్తే.. అందరికీ గుర్తుకు వచ్చేది వెన్నుపోటు మాత్రమే. మోసం గుర్తుకు వస్తుంది.. కుతంత్రాలు గుర్తుకు వస్తాయి. పేదలకు ఏ మంచీ చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారు?్ణ్ణ అని ప్రశ్నించారు.

ాాచంద్రబాబు, పవన్ ఎలాంటి వాళ్లంటే.. అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అనే రకం. అక్కడే వీరి శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద వీరికి ఎలాంటి ప్రేమా లేదు. కనీసం ఇక్కడ ఉండాలన్న ఆలోచన కూడా తట్టదు్ణ్ణ అని ఆరోపించారు.

ాాఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి.. వీరి పార్టీలు, వీరి సిద్ధాంతాలు ఒక్కటే. మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని హైదరాబాద్‌లో నివాసం ఉండడం. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశానని చంద్రబాబు కోతలు కోస్తాడు. మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు, 175 చోట్ల ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు. చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌ మీద ఉంది. నలుగురు కలిసి లేపితే తప్ప లేవలేని పరిస్థితిలో ఉంది్ణ్ణ అని ఎద్దేవా చేశారు.

ాారెండు చోట్ల పోటీచేస్తే.. రెండు చోట్లా దత్తపుత్రుడ్ని ప్రజలను ఓడించారు. 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ దత్తపుత్రుడు కనీసం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు. పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ఈ ప్యాకేజీ స్టార్‌. నాకు సీఎం పదవి లేకపోయినా పర్వాలేదు. దోపిడీలో నా వాటా నాకు వస్తే చాలంటున్నాడు. వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలి్ణ్ణ అని జగన్ కోరారు.

ాాదత్త తండ్రికి.. దత్త పుత్రుడికి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది. మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటే.. ాచిత్తం ప్రభూ్ణ అని దత్తపుత్రుడు దాసోహం అవుతాడు. విడివిడిగా వెళ్తే మంచి జరుగుతుందని చంద్రబాబు చెప్తే.. ాఅలాగే సర్‌.. మీకు ఏది మంచి జరిగితే అలా చేద్దాం్ణ అంటాడు. ానువ్వు పోటీ చేయకు్ణ అని అంటే.. ాజీ హుజూర్‌్ణ అంటాడు. ాకమ్యూనిస్టులతో కలిసి ఉండు్ణ అంటే.. ాఅలాగే సర్్ణ అంటాడు్ణ్ణ అని జగన్ ఎద్దేవా చేశారు.

ామనం విడివిడిగా పోటీచేసినట్టు కనిపిస్తాం.. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందాం.. నేను గాజువాక రాను, భీమవరం రాను, నువ్వు మంగళగిరిలో పోటీ పెట్టకు్ణ అని చంద్రబాబు అంటే.. దత్తపుత్రుడు ాఅలాగే సర్‌్ణ అంటాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ాబీజేపీ పక్కన నువ్వు ఉండు దత్తపుత్రా్ణ అని చంద్రబాబు చెప్తే.. ాచిత్తం ప్రభూ్ణ అని దత్తపుత్రుడని.. మళ్లీ ాబీజేపీకి విడాకులు ఇచ్చేయ్‌్ణ అని చంద్రబాబు అంటే.. ామీరు ఎలా చెప్తే అలా చేస్తా్ణ అంటాడని.. ఇలాంటి రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నాయిఁ అంటూ సెటైర్లు వేశారు.

ాాపొత్తులు పెట్టుకునేది వీళ్లే. విడిపోయేది వీళ్లే. వివాహాలు చేసుకునేది వీళ్లే. విడిపోయేది వీళ్లే. రెండు సినిమాల మధ్య విరామంలో అప్పుడప్పుడూ దత్తపుత్రుడు పొలిటికల్‌ మీటింగులు పెడతాడు. పార్టీని హోల్ సేల్ గా ప్యాకేజీ స్టార్ అమ్ముకున్నాడు. బాబు చెప్పే స్క్రిప్టు ప్రకారం.. ప్యాకేజీల స్టార్‌ వచ్చి నాలుగు రాళ్లు మీ బిడ్డ మీద వేసి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా? వీళ్లు ప్రజలకు మంచి చేయగలరా?్ణ్ణ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img