Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

నోరు మూసుకో… రైతును కసురుకున్న మంత్రి కారుమూరి

తాజాగా మరో రైతుపై ఆగ్రహం
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ రైతును ఎర్రి పప్ప అని పిలవడం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఆయన మరో రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్ నోరు మూసుకో అంటూ కసురుకున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోగా, తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు మంత్రి కారుమూరి ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఓ రైతు సమస్యలు చెప్పుకుంటుండగా, మంత్రిలో అసహనం కట్టలు తెంచుకుంది. ఏం కావాలి నీకు… అంటూ గద్దించారు. వీడియో చిత్రీకరిస్తున్న విలేకరులను కూడా రికార్డింగ్ ఆపాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img