Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

పంచాయతీ నిధుల మళ్లింపుపై సమాధానం చెప్పాలి

సీఎం జగన్‌కు లోకేష్‌ బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటల్లా తాకట్టుపెట్టడం, ఈ మూడిరటి మీదనే తమరు పాలన సాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. . గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన రూ.1309 కోట్ల నిధులను తిరిగి పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండు చేశారు. నాలుగు నెలల క్రితం 14వ ఆర్ధిక సంఘం నేతలు 344 కోట్లు విద్యుత్‌ బకాయిల కింద జమేసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పి.ఎఫ్‌.సి , ఆర్‌.ఇ.సిల వద్ద రుణాలు తెచ్చేందుకు నిబంధనలు తుంగలో తొక్కారన్నారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై తమరు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండు చేశారు. గ్రామాల అభివృద్దిని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలని హితవుపలికారు. పల్లెల్లో దిగజారిన పరిస్థితులను చక్కదిద్దేందుకు మళ్లించిన నిధులు, ఎగవేసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని లోకేష్‌ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img