. నవంబరు 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
. డిసెంబరు 30న తుది జాబితా
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా, తాజాగా కృష్ణా, గుంటూరు నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనున్నారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించి… అదే నెల 30న తుది జాబితా వెల్లడిరచనున్నారు.