Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

పయ్యావుల కేశవ్‌కు భద్రత ఉపసంహరణ

భద్రత తొలగింపుపై మండిపడుతున్న టీడీపీ నేతలు
టీడీపీ కీలక నేత, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. గన్‌ మెన్లను వెనక్కి రావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు 1 ప్లస్‌ 1 భద్రత ఉండేది. మరోవైపు పయ్యావులకు గన్‌ మెన్లను ఉపసంహరించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భద్రతను తొలగించారని దుయ్యబడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన నేపథ్యంలోనే భద్రతను తొలగించారని అంటున్నారు. ఇంకోవైపు తనకు భద్రతను పెంచాలని ఇటీవలే ప్రభుత్వానికి పయ్యావుల లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయనకు ఉన్న భద్రతను సైతం తొలగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img