Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పవన్‌ టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు : సజ్జల


పవన్‌ టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు అన్నారు. ‘రోడ్ల గుంతలు మీరు పూడ్చడం ఏమిటి?. అందుకు సీఎం జగన్‌ రూ.2,200 కోట్లు కేటాయించారు. వర్షాలు తగ్గగానే రోడ్లు మరమ్మత్తులు చేస్తాం. ఈలోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది.’ అని అన్నారు. టీడీపీ హయాంలో రూ.800 కోట్లు ఇచ్చారు. వాళ్లు బిల్లులు ఇవ్వకపోతే మేము ఇచ్చాం. టీడీపీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. పవన్‌ ఆనాడు ఏమయ్యారు? అప్పుడు ఎందుకు శ్రమదానం చెయ్యలేదు అని మండిపడ్డారు. కొవిడ్‌ నిబంధనలు అందరికీ సమానమే. ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు. ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల ఇబ్బంది పడేది ప్రజలే అని అన్నారు. కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేలాదిమందితో సభ ఎలా నిర్వహిస్తారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img