Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే..

విద్యా దీవెన పథకంతో 11లక్షల మంది విద్యార్థులకు లబ్ధి : సీఎం జగన్‌
పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం.. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే అని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకంతో 11లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ..ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌-జూన్‌ 2022 కాలానికి గానూ 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img