Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

పిల్లలూ….చరవాణి తీసుకురండి..!

బైజూస్‌ యాప్‌పై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
విశాలాంధ్ర బొమ్మనహళ్‌ : సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు బైజూస్‌ సంస్థ రూపొందించిన పాఠ్యాంశాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే పాఠశాలలో పిల్లల్ని సన్నద్ధం చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి చరవాణి తీసుకురమ్మని తలగత గదుల్లో బైజుస్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేయిస్తున్నారు.
నాలుగవ తరగతి నుంచి బోధన
నాలుగో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు ఇస్తామని ప్రకటించింది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల చరవాణి నంబర్లు సేకరించారు. నవంబర్‌ నుంచి ఈ పాఠాలు ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతున్నారు. యాప్‌ డౌన్లోడ్‌ చేసుకున్న తరువాత వచ్చే ఓటీపీ నమోదు చేస్తే పాఠ్యాంశాలు వస్తాయని వాటిని ఇంటి వద్ద అభ్యసిస్తే సరిపోతుంది అని అధికారులు అంటున్నారు.
స్మార్ట్‌ ఫోన్‌ లేని వారిలో ఆందోళన
ఈ యాప్‌ తప్పనిసరి కాదని చెబుతునా..స్మార్ట్‌ ఫోన్‌ లేని వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో గ్రామీణ నేపథ్యమున్న విద్యార్థులే ఎక్కువగా చదువుతుంటారు. ఇందులో నిరుపేదలే అధికం కొందరు ఇప్పటికే ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగించలేకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంతర్జాల సౌకర్యం పూర్తిస్థాయిలో ఉండడం లేదు. ఇలాంటి చోట ప్రజలు సాధారణ ఫోన్లు వాడుతున్నారు. కరోనా సమయంలో లాక్‌ డౌన్‌ కారణంగా రెండు సంవత్సరాల పాటు పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాయి. చాలామంది విద్యార్థులు ఆన్లైన్‌ తరగతులను వినియోగించుకోలేకపోయారు. ప్రస్తుతం బైజుస్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసి దాని ద్వారా ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు
డౌన్లోడ్‌ ప్రక్రియ సాగుతుంది.
మండల విద్యాధికారి తిమ్మప్ప
ప్రభుత్వ పాఠశాలలో బైజుస్‌ యాప్‌ ను ఉపాధ్యాయులు డౌన్లోడ్‌ చేస్తున్నారు చైల్డ్‌ ఇన్ఫో ఆధారంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్‌ ఫోన్‌ ఉందా లేదా అనే వివరాలు సేకరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారి విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తరగతుల వారీగా యాప్‌ డౌన్లోడ్‌ చేస్తున్నాం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img