Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

పుష్ప నిర్మాత, దర్శకుడి కార్యాలయాల్లో ఐటీ దాడులు!

పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విడుదలకు ముందు ఈ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు సుకుమార్ కు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తీయడంతో పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థను కూడా నడిపిస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను కూడా రూపొందిస్తోంది. ఇక సుకుమార్ దర్శకుడిగానే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన ‘విరూపాక్ష’ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతోంది. సుకుమార్, మైత్రీ మూవీస్ ఆఫీసుల్లో సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img