Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

పేదలకు అండ ఎర్రజెండా

. కర్ల లింగయ్య భవన్‌ ప్రారంభిస్తూ రామకృష్ణ
. ఎరుపెక్కిన పెనుగంచిప్రోలు
. సీపీఐ అధ్వర్యంలో భారీ ర్యాలీ

విశాలాంధ్ర- పెనుగంచిప్రోలు: కేంద్ర, రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగు తోందనీ, ఈ పాలన అంతంకావడం ఎర్రజెండా తోనే సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. పేదవారికి ఎర్రజెండా అనునిత్యం అండగా ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులోని తూర్పు బజారులో కర్ల లింగయ్య కళాభవన్‌ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ముచ్చింతాల గ్రామం నుంచి పెనుగంచిప్రోలు వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించడంతో పెనుగంచిప్రోలు ఎరుపెక్కింది… ర్యాలీ అనంతరం కర్ల లింగయ్య కళాభవన్‌ను కె.రామకృష్ణ ప్రారంభించారు. భవనం ఎదురుగా అరుణపతాకాన్ని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లీ విల్సన్‌ ఆవిష్కరిం చారు. భవనంపైన ఎర్ర జండాను సీపీఐ జిల్లా కార్యదర్శి సి హెచ్‌. కోటేశ్వరరావు ఎగర వేశారు. అనంతరం స్నేహ గార్డెన్లో నిర్వహించిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించిందనీ, అన్ని కులాల వారికి న్యాయం చేస్తానని అందరికీ పదవులు ఇచ్చిన సీఎం జగన్‌ పేరుకు మాత్రమే పదవులు కట్టబెట్టి పెత్తనం మటుకు తాను ఏర్పాటు చేసుకున్న గ్యాంగుతో చెలాయిస్తున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ల నడ్డి విరగగొడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జల్లి విల్సన్‌ మాట్లాడుతూ, గొప్ప చరిత్రాత్మక ఉద్యమ స్ఫూర్తిని నిలిపిన చరిత్ర పెనుగంచిప్రోలు గ్రామానికి ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల ఉద్యమాలు ఎర్రజెండాతోనే సాధ్యమన్నారు. నందిగామ, జగ్గయ్యపేట సీపీఐకి రెండు కళ్లని, పిల్లలమర్రి వెంకటేశ్వర్లును శాసనసభ్యునిగా గెలిపించి శాసనసభకు పంపించిన ఘనత సీపీఐకి మాత్రమే దక్కుతుందని అన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, ముచ్చింతాల వంటి గ్రామాలు రాజకీయాలకు కేంద్రం కావాలనీ, ఉద్యమాలకు పార్టీ కార్యాలయాలు కేంద్ర బిందువులుగా ఉండాలని అకాంక్షించారు. సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ, కర్ల లింగయ్య ప్రజా నాట్యమండలిలో కళాకారుడిగా విప్లవాత్మకమైన బుర్రకథలను చెప్పేవారని బుర్ర కథలు వినిపిస్తూ ప్రజలను చైతన్యపరిచారని…. 1985వ సంవ త్సరంలో పెనుగంచిప్రోలు గ్రామంలో సీపీఐలోకి యువత రావాలనీ, పార్టీ కార్యాలయం ఉండాలని దృఢ సంకల్పంతో ఆ రోజులలోనే 25 వేల రూపాయలు విరాళంగా అందించారని తెలిపారు. సీపీఐ జిల్లా డిప్యూటీ సెక్రెటరి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలు తీరి ప్రజల సుభిక్షంగా ఉండాలంటే ఒక్క ఎర్ర జెండాతోనే సాధ్యమవుతుందన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, జిల్లా కార్యదర్శి. లంకా గోవిందరాజులు కూడా మాట్లా డారు. జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్‌ రాజగోపాల్‌ నూతన భవనాన్ని సందర్శించారు. సభానంతరం గ్రామ వైకాపా ప్రముఖు కులు వేల్పుల రవికుమార్‌, గ్రామ మేజర్‌ పంచాయతీ ప్రధాన పౌరురాలు వేల్పుల పద్మ కుమారి సీపీిఐ శ్రేణులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి అధ్యక్షులు పి చంద్ర నాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య అధ్వర్యంలో ఆలపించిన విప్లవగేయాలు ఉత్తేజపరిచాయి. కార్యక్రమానంతరం గ్రామం మొత్తానికి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, మాజీ ఎంపిపి పొన్నం. నరసింహారావు.నందిగామ నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి చుండూరు. సుబ్బారావు.మండల కార్యదర్శి కనకపుడి బాబూ రావు, జక్కులూరి వెంకటేశ్వర్లు. పొన్నం. రవి. చాట్ల. లక్ష్మయ్య, కర్ల లింగయ్య మనువడు. తిరుపతమ్మ అమ్మ వారి ఆలయ మాజీ చైర్మన్‌ కర్ల. వెంకటనారాయణ.మాజీ ఎంపీపీి. వేగినేటి. గోపాల కృష్ణమూర్తి, ఆంబోజి. శివాజీ. ఇంటూరి. నాగేశ్వర రావు. జోన్నేబోయిన. శ్రీనివాసరరావు. చల్లాల. శివాజీ.(సిద్దాంతి) వేల్పుల. కాంతయ్య. వట్టికొండ. చంద్రమోహన్‌. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img