పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో 3,16,000 ఇళ్లను ప్రారంభించి 2,62,000 పూర్తి చేశామని తెలిపారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకిచ్చిన భూములు చెరువులను తలపిస్తున్నాయన్నారు. జగనన్న కాలనీ స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టుల్లో కేసు వేసిందని చెప్పడం అబద్ధమని చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాలకు తాము అడ్డుపడలేదని ఆధారాలతో నిరూపించామని అన్నారు. వైసీపీ మూడేళ్లల్లో ఐదిళ్లు మాత్రమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. 1983 నుంచి రాష్ట్ర ప్రజానికానికి టీడీపీ బాసటగా ఉందని అన్నారు.