Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే వైసీపీ పని.. అశోక్‌ గజపతిరాజు

ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే వైసీపీ సర్కార్‌ పని అని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ%ౌౌ% ఏపీలో రాజ్యాంగేతర పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షాల పర్యటనలను అడ్డుకునేందుకే జీవో నెం.1 అని అన్నారు. ఆ జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసినా వైసీపీ ప్రభుత్వానికి బుద్ది రాలేదన్నారు. జగన్‌ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఏపీలో పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఏపీలో ప్రభుత్వ అధికారులకు కూడా సరిగ్గా జీతాల్లేవన్నారు. ఏపీలో మంత్రులకు విలువ లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img