Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలి : సీఎం జగన్‌

బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,‘‘ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి. వరి పండిస్తే.. వచ్చే ఆదాయం మిల్లెట్స్‌ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీని కోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి. మిల్లెట్స్‌ పండిరచినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి. మిల్లెట్స్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీంతో పాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని’’ అన్నారు. సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి..రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి అని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు.ంౖతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదు
?డిమాండ్‌ మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img