: అశోక్‌గజపతిరాజు
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. 150కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు అన్ని మతాలను గౌరవించాలని అన్నారు.రామతీర్థం ఘటనపై యాక్షన్ తీసుకోకుండా రాజకీయం చేశారని మండిపడ్డారు. మాన్సాస్ సిబ్బందికి జీతాలివ్వమంటే తనపై ఓ ఈవో కేసు పెట్టారన్నారు. తాను కోర్టుకు వెళ్తే జీతాలు ఇవ్వమన్నారు..కానీ ఈవోపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు.