Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఫిబ్రవరిలో అసెంబ్లీ – బడ్జెట్‌ సమావేశాలకు కసరత్తు..

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలోనే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌ సమావేశాలను దాదాపు నెల రోజులపాటు జరపాలని కూడా ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకే సభ సజావుగా నడిపిస్తూనే గడచిన మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనే దానిపై అంశాలవారీగా కూలం కుశంగా వివరించేలా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఈసారి సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును పెట్టి తీరాలని ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమౌతోంది. మార్చిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న సీఎం జగన్‌ ఆమేరకు మూడు రాజధానుల బిల్లుకు తుదిమెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు. దీనితోపాటు మరో 10 నుండి 15 బిల్లుల వరకూ సభ ముందుకు వచ్చే అవకాశముందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో ముందస్తు ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో సీఎం జగన్‌ నెల రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించ బోతున్నారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నా యి. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కూడా ముందస్తుకు సంకేతాలిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి జరగ బోయే బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img