ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని లబ్దిదారులందరికీ మార్చి నెల వరకూ ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2021 డిసెంబరు నుంచి లబ్దిదారులకు ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ఏపీ పౌరసరఫరాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనవరి 18 తేదీ నుంచి రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా 10 కేజీల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడిరచారు.