Friday, August 12, 2022
Friday, August 12, 2022

బంద్‌ సందర్భంగా విజయవాడలో స్పెషల్‌ రోబో టీమ్స్‌ ఏర్పాటు

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. విజయవాడలో పాక్షికంగా భారత్‌ బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడిరచారు. మరోవైపు.. భారత్‌ బంద్‌ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్‌లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలర్ట్‌ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img