Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బద్వేలు గెలుపు.. ప్రజలు ఇచ్చిన దీవెనలుగా భావిస్తున్నా

సీఎం జగన్‌
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ ఘన విజయం సాధించారు.ఈ విజయంపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.బద్వేల్‌ ఉపఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతీ ఆత్మీయ సోదరునికి పేరుపేరునా జగన్‌ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు.‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను’’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img