Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

బలహీనపడనున్న వాయుగుండం…ఏపీ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనం

సోమవారానికి మళ్లీ అల్పపడీనంగా బలహీనపడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ చత్తీస్‌ గఢ్‌ మీదుగా ప్రయాణిస్తూ నేడు తీవ్రత తగ్గి అల్పపీడనం స్థాయికి పడిపోతుందని వివరించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణిస్తూ సోమవారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది.ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ జల్లులు కురవడంతో పాటు తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆదివారం పాలకోడేరులో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img