Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బీజేపీని చూస్తుంటే జాలేస్తుంది : సజ్జల

ఏపీ బీజేపీని చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని..అందుకే ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎక్కడైనా జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి. ఏపీలో మాత్రం రివర్స్‌ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పని చేస్తోందని అన్నారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఎద్దేవా చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోంది. సొంత అజెండాతో బీజేపీ ఎందుకు పనిచేయడం లేదు. తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ ఎందుకు ప్రశ్నించదు అని ప్రశ్నించారు.సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని, ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img