Monday, January 30, 2023
Monday, January 30, 2023

బీజేపీపై మంత్రి పేర్ని నాని ఫైర్‌

బీజేపీ నేతలవి ఓట్ల రాజకీయాలు అంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ నేతలు.. చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని అన్నారు. ‘పెరుగుతున్న డీజిల్‌, పెట్రోలు ధరలపై బీజేపీ నేతలు బాధపడాలి. పెరుగుతున్న ఎరువుల రేట్లపై బీజేపీ నేతలకు బాధలేదా?. ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారు. ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదు. ప్రజాగ్రహ సభలో పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడాలని’’ అన్నారు. ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహాసనానికి తెరలేపింది. ‘బీజేపీకి ఏపీలో ఒక అజెండా, ఒక సిద్ధాంతం, ప్రజా సమస్యలపై దృష్టి ఏమీలేవు. ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు…? మీకు చంద్రబాబు ఎజెండా తప్ప మరో ఎజెండా ఉందా మీకు..?’ అని ప్రశ్నించారు. ‘ఏపీ తెచ్చిన అప్పులో ప్రతి పైసాకి లెక్క ఉంది. మేము జీఎస్‌ డీపీలో 3 శాతం లోపు అప్పు తెస్తే గోల చేస్తున్నారు. జీడీపీలో 21 శాతం పైబడి అప్పు తెచ్చింది.. దీనికి కారణం ఎవరు..? 1.35 లక్షల కోట్ల అప్పు నేడు మన దేశానికి ఉంది. ఈ ఏడేళ్లలో 73 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. మీరు ఏపీ అప్పుల గురించి మాట్లాడతారు.. మేము చట్టాలను అతిక్రమించి అప్పు తెస్తే మీరు ఊరుకునేవారా..?’ అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img