Monday, January 30, 2023
Monday, January 30, 2023

బెదిరింపులకు భయపడకండి..ఫిర్యాదు కాపీలను నాకు పంపండి : ఎంపీ సుజనా

ఏపీలో సీఎం, మంత్రుల పేర్లతో బెదిరింపులు పెరిగాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీల పేర్లతో బెదిరించడం, కబ్జాలకు పాల్పడడం రివాజుగా మారిందని ఆరోపించారు. . విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని అన్నారు. ఇలాంటి ఘటనలను ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే అరికట్టాలన్నారు. బాధితులు వేధింపులకు భయపడకుండా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలన్నారు. బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆ కాపీలను మెయిల్‌కు పంపించండి అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img