జూద క్రీడలు గురించి బయట పడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రి కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు ఎక్కడ బయట పడతాయన్న భయంతోన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మంత్రి కొడాలి నాని ఎటువంటి సమావేశాలు పేట్టలేదని, ఇవాళ కే కన్వెన్షన్‌లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం, అతని భయాన్ని తెలియజేస్తుందని నారాయణరావు అన్నారు.