Friday, December 1, 2023
Friday, December 1, 2023

భవిష్యత్‌ నాయకుడిని కోల్పోయాం

నవీన్‌ సంస్మరణ సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల

విశాలాంధ్ర`గుంటూరు : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నవీన్‌ రూపంలో భవిష్యత్‌ నాయకుడిని కోల్పోయిందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ నగర సమితి సభ్యుడు గౌరిబోయిన నవీన్‌ సంస్మరణ సభ ఇక్కడి మల్లయ్య లింగంభవన్‌లోని వీఎస్‌కే హాలులో శనివారం జరిగింది. ఈ సందర్భంగా నవీన్‌ చిత్రపటానికి కుటుంబసభ్యులు, పార్టీల, కార్మిక, ప్రజాసంఘాల, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంకితభావం, పట్టుదల, ఓర్పు, నేర్పు నవీన్‌లో స్పష్టంగా కనబడతాయన్నారు. రాజకీయ, ఆర్థిక పరంగా సమర్థవంతమైన వ్యక్తిగా నవీన్‌ రాణిస్తున్న తరుణంలో కొవిడ్‌ భారినపడి మృతి చెందడం బాధాకరమన్నారు. నవీన్‌ లాంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారని చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంధ్రనాథ్‌ మాట్లాడుతూ ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నవీన్‌ మృతి విద్యార్థి, యువజనుల ఉద్యమానికి తీరని లోటన్నారు. చిన్న వయస్సు నుంచే ఆదర్శభావాలు కలిగి ఉండేవాడని, మూడు తరాలుగా పార్టీకి సేవలందిస్తున్న జీవీ కృష్ణారావు కుటుంబం నుంచి నాయకుడిగా వస్తాడనుకున్న తరుణంలో నవీన్‌ మృతి చెందడం విచారకర మన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ చిరునవ్వుతో పలకరిస్తూ అందరితో ఆప్యాయంగా మెలుగుతూ ప్రతిఒక్కరి యోగక్షేమాలు అడిగి తెలుసుకునే నవీన్‌ జ్ఞాపకాలు మరచిపోలేని వన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నవీన్‌ అకాల మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ముఠా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన ఆంజనేయులు మాట్లాడుతూ పెద్దల పట్ల నవీన్‌ వినమ్రతతో ఉండే వాడని గుర్తుచేసు కున్నారు. గుంటూరు నగర కార్పొ రేటర్లు రామబోయిన అజయ్‌, అడకా పద్మ, సంకూరి శ్రీనివాసరావు, ఆంధ్రప్ర దేశ్‌ ప్రజానాట్యమండలి అధ్యక్షులు గని, విశాలాంధ్ర విజ్ఞాన సమితి మాజీ జీఎం వై. చెంచయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పాశం వెంకటేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాని, జీవీకే మెమోరియల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అమ్మిశెట్టి శివ, మాజీ కార్పొరేటర్‌ కుమ్మర కోటేశ్వర రావు, ప్రోగ్రెసివ్‌ ఫోరం నాయకులు పీవీ మల్లిఖార్జున రావు, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, డాక్టర్‌ ప్రత్యూష సుబ్బారావు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భగవాన్‌దాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు నూర్‌ బాషా నాయుడు, అయ్యస్వామి తదిత రులు మాట్లాడారు. సీపీఐ నగర నాయకులు ఆకిటి అరుణ్‌కుమార్‌ వక్తలను వేదికపైకి ఆహ్వానించగా రావుల అంజిబాబు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమం లో అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారా యణ, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు జి.సురేష్‌, నూతలపాటి చిన్న, షేక్‌ అమీర్‌వలి, చల్లా మరియదాసు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌ జీ, ప్రజానాట్య మండలి కార్యదర్శి మట్టుపల్లి మహేంద్ర, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్‌, నవీన్‌ కుటుంబ సభ్యులు కోటేశ్వరమ్మ, జి.సుధాకర్‌, కవిత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img