Monday, March 27, 2023
Monday, March 27, 2023

భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం కొనేవారికి ఇదే మంచి సమయం. గత కొంతకాలంగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కొంత తగ్గుముఖం పట్టింది. ఇది పసిడి ప్రయులయు శుభవార్తే అని చెప్పాలి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల తులం బంగారం రేటు క్రితం సెషన్‌తో పోలిస్తే రూ.100 తగ్గి.. రూ.52,400లకు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు స్వల్పంగా రూ.10 పెరిగి రూ.57 వేల 240 వద్దకు చేరుకుంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కూడా బంగారం ధర తగ్గుతోంది. అక్కడ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.100 తగ్గి రూ.52,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.70 తగ్గి రూ.57 వేల 310 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర పెరిగింది. కిలో సిల్వర్‌ ధర క్రితం సెషన్‌తో పోలిస్తే రూ.500 పెరిగి రూ.72,500 లకు చేరింది. ఇక దేశ రాజధాని దిల్లో కిలో వెండి రేటు రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.70,400 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీ గోల్డ్‌ ధర కాస్త ఎక్కువగా, సిల్వర్‌ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే ట్యాక్స్‌లను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img