Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ: సీఎం జగన్‌

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు. సీఎం జగన్‌ను అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ షేక్‌ సాదియా అల్మస్‌ కలిశారు. షేక్‌ సాదియా అల్మస్‌ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. షేక్‌ సాదియాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు.అదే విధంగా మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img