అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల రేసులో చాలామంది ఉన్నారని వెల్లడిరచారు. అయితే, మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కనబెట్టినట్టు కాదని స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనంటూ వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో లేనివారు పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్వరలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.