Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు

ఏపీ కేబినెట్‌ చివరి భేటీ సందర్భంగా మీడియాకు మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. తనకు మీడియా చేసిన సహాయం అమోఘమని, ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని అన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను అని మంత్రి పేర్ని నాని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img