Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

మనం ప్రజాస్వామ్యమంలో ఉన్నామా?

కుప్పంలో నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు..
కుప్పంలో హైటెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటనకు ముందు అన్నా క్యాంటిన్‌ను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడిరది. విషయం తెలుసుకున్న చంద్రబాబు క్యాంటిన్‌ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడుచుకుంటూ అన్నా క్యాంటిన్‌ వైపు వెళ్లారు. బస్టాండ్‌ దగ్గర చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు.. వైఎస్సార్‌సీపీ దాడికి నిరసనగా ధర్నాకు దిగారు. ఇది కుప్పం చరిత్రలోనే చీకటిరోజని.. మనం ప్రజాస్వామ్యమంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశామా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.. పోలీసులు సీఎం చేతిలో కీలుబొమ్మలు మారిపోయారని మండిపడ్డారు. బాదుడే, బాదుడు కార్యక్రమాని చూసి తట్టుకోలేకపోతున్నారని.. ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూశాను కానీ ఇలాంటి వారిని చూడలేదన్నారు. బస్టాండ్‌లో దాడులు జరుగుతుంటే పోలీసులకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చెప్పారు. అన్న క్యాంటిన్‌ ధ్వంసం చేయడం దారుణమని.. ఖబడ్దార్‌ మిస్టర్‌ జగన్‌ అంటూ సీరియస్‌ అయ్యారు. కుప్పంలో రెండు రోజులుగా ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు బుధవారం నియోజకవర్గం పర్యటనకు వచ్చారు. రామకుప్పం మండలం కొల్లుపల్లిలో రోడ్‌ షో జరిగిన సమయంలో.. టీడీపీ శ్రేణులు-వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. ఇరువురు వర్గాలు నినాదాలతో హోరెత్తించారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.. రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం చంద్రబాబు పర్యటన కొనసాగింది. ఇవాళ కూడా కుప్పంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం ఉదయం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పట్టణంలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు.. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా లాగేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. కుప్పంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుండటంతో పోలీసులను భారీగా మోహరించారు. ఇటు ఎమ్మెల్సీ భరత్‌, ఎంపీ రెడ్డప్ప కూడా రోడ్డుపై బైఠాయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img