Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మరో కుంభకోణం జరుగుతోంది..చూస్తూ ఊరుకోం : పయ్యావుల కేశవ్‌

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల విషయంలో మరో కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేత, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, పీఏసీ చైర్మన్‌గా లేపాక్షి భూములపై లేఖ రాశానన్నారు. టెండర్లలో అరబిందో, రాంకీ, ఎర్తిన్‌ సంస్థలు పాల్గొన్నాయన్నారు. ఎర్తిన్‌ సంస్థలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ కుమారుడు ఉన్నారన్నారు. ఈ టెండర్‌ సీఎం జగన్‌ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. వేల కోట్ల పెట్టుబడులు, వేల మందికి ఉద్యోగాలు వచ్చే చోట.. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని ఆరోపించారు. దీనిని చూస్తూ ఊరుకోమని, న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img