Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు : మోహన్‌ బాబు

తనకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేదని సినీ నటుడు మోహన్‌ బాబు స్పష్టం చేశారు. తనకు చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ బంధువులేనని, అందుకే వారి తరపున ప్రచారం చేశానని చెప్పారు. గతంలో చంద్రబాబుకు ప్రచారం చేశానని, 2019 ఎన్నికల్లో జగన్‌ తరపున ప్రచారం చేశానని తెలిపారు. ప్రస్తుతం తాను సినిమా వ్యవహారాలు, తన యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నానని ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని డిసైడ్‌ అయ్యానని చెప్పారు. మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంపై వస్తున్న విమర్శలను మోహన్‌ బాబు తీవ్రంగా ఖండిరచారు. పేర్నినాని తనకు స్నేహితుడని చెప్పారు. మంత్రి బొత్స కుమారుడి వివాహానికి వచ్చిన సందర్భంగా తన ఇంటికి మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు. పేర్నినానితో సమావేశంపై అనవసర రాద్దాంతం చేయవద్దని, సినీ పరిశ్రమతో జరిగిన సమావేశం గురించి ఎలాంటి వాకబు చేయలేదని మోహన్‌ బాబు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img