Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మహిళలు పెద్ద పెట్టున తమ సమస్యలను వినిపించడంతో..చెవులు మూసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ బుధవారం ఇలాంటి ఘటనే ఒకటి చోటచేసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిని నియోజకవర్గ మహిళలు నిలదీశారు. అంతేకాకుండా పెద్ద పెట్టున తమ సమస్యలను వినిపించడంతో సుధీర్‌ రెడ్డి తన చెవులు మూసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకెళితే… జమ్మలమడుగు పరిధిలోని ఎర్రగుంట్లలో బుధవారం చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో సుధీర్‌ రెడ్డి పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని మహేశ్వరనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లగా… బోరు బావి సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళలు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా మహిళలంతా ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ తమ సమస్యను పరిష్కరించాలని కోరగా… ఎమ్మెల్యే తన చెవులు మూసుకున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి బయలుదేరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img