Monday, February 6, 2023
Monday, February 6, 2023

మహిళల భద్రతలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ : జగన్‌

మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమది అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వమని, అమ్మ ఒడి పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై చర్చలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మాదని అన్నారు.రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్‌ ఇస్తున్పాం. నెలకు రూ. 1500 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకం తీసుకొచ్చాం. అదనపు ఆదాయం పొందేలా వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ఇచ్చాము. 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం. 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని చెప్పారు. ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు వెళ్లి, కేసులు వేసి ఆపాలని చూశారు. అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారని అన్నారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 18లక్షల 81వేల మందికి రూ.5,573కోట్లు చెల్లించాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30లక్షల 16వేల మందికి మేలు కలుగుతోంది. 77 గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాన్ని చేపట్టాం. మహిళల భద్రతకు దిశా చట్టం తీసుకొచ్చాం అని చెప్పారు.మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థను తీసుకొచ్చాం. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img