Monday, March 20, 2023
Monday, March 20, 2023

మార్చికి 5 లక్షల ఇళ్లు పూర్తి

. ఇప్పటివరకు రూ.13,780 కోట్లు ఖర్చు
. ననాణ్యత విషయంలో రాజీవద్దు
. సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సుమారు ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి అవి పూర్తి అవుతాయని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గృహనిర్మాణశాఖపై సమీక్షలో ఇళ్ల నిర్మాణాలో పురోగతి గురించి ముఖ్య మంత్రికి అధికారులు వెల్లడిరచారు. ఇళ్ల నిర్మాణ కోసం ఇప్పటివరకూ రూ.13,780 కోట్లు ఖర్చు చేయగా, 2.75 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. 74వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతుండగా, మరో 79 వేల ఇళ్లు రూఫ్‌ లెవల్లో ఉన్నాయన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ సొంతిల్లు అనేది పేదోడి కలని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం రాకుండా లక్ష్యాని కనుగుణంగా నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. ఇళ్ల నిర్మాణాల నాణ్యతకు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ల్యాబులను వినియోగించుకుని, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని సూచించారు. జగనన్న కాలనీల లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించాలన్నారు. లేఅవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగా లన్నారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనం తపురం జిల్లాల్లోని రెండు లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు తెలియజేయగా, సుమారు 30 వేల మందికి ఇళ్ల నిర్మాణం కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, అందుకు అసవరమైన భూ సేకరణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్షించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు కింద మౌలిక సదుపాయాల కోసం మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చు చేశామన్నారు. 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల లబ్ధి పేదలకు జరిగిందని సీఎం వెల్లడిరచారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన డబ్బును మాఫీ చేయడమే కాకుండా బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని నెలా నెలా వాయిదాలు కట్టాల్సిన పని లేకుండా ఉచితంగా ఇళ్లు ఇస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని విధంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సమావేశంలో మంత్రులు జోగి రమేశ్‌, ఆదిమూలపు సురేశ్‌, స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణా భివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌జైన్‌, ప్రత్యేక కార్యదర్శి ఎండీ దివాన్‌ మైదిన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ లక్ష్మీషా, టిడ్కో ఎండీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img