వందల మంది పోలీసులను పెట్టి మైలవరం బంద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూశారని మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్పారు.ప్రజలు, వ్యాపార సంస్థలు, అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మైలవరం బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. రెండవ రోజు జి.కొండూరు బంద్ కార్యక్రమానికి తనను వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రకటనలో స్పష్టంగా మైలవరంకు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ఉద్యమానికి సహకరించాల్సిందిగాపోయి నాయకులను ముందస్తు అరెస్టు చేయించి ఏం సాధించారని ప్రశ్నించారు.