Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

మూడు ముక్కలాటను ఎవరు పట్టించుకోరు : రఘురామరాజు

తిరుపతిలో రైతుల మహాసభ విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నానని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామరాజు అన్నారు. రేపు తాను కూడా రైతుల సభలో వర్చువల్‌గా పాల్గొంటానని చెప్పారు. . గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ. గతంలో అమరావతిపై అసెంబ్లీలో జగన్‌ దగాకోరు మాటలు చెప్పారని అన్నారు. అమరావతి రైతులను జగన్‌రెడ్డి మోసం చేశారు. ‘13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టనని చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేయడం తగునా?రాయలసీమపై సీఎం జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉందా? సీమ ప్రాజెక్ట్‌లను ఎందుకు పూర్తి చేయడం లేదు? ఎంత సీమ తత్వాన్ని రెచ్చగొట్టినా.. మీ మూడు ముక్కలాటను ఎవరు పట్టించుకోరు’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img