Monday, October 3, 2022
Monday, October 3, 2022

మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు వెళ్లడం సరైంది కాదు : రామకృష్ణ

మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై కోర్టులు పదేపదే మొట్టికాయలు వేసినా జగన్‌ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ఆయన ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో శాసనసభలో అమరావతిని ఏపీ రాజధానిగా అంగీకరించిన విషయాన్ని జగన్‌ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అమరావతిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్‌ మూడు రా జధానుల అంశాన్ని మరోమారు తెరపైకి తెస్తున్నారని…ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ శాసనసభలో చేసిన నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం మార్చాలనుకోవడం శాసనవ్యవస్థను అవమానించడమేనన్నారు. నిజంగా శాసనవ్యవస్థపై జగన్‌ సర్కార్‌కు గౌరవముంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img