Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాప‌న.. సీఎం జ‌గ‌న్

మే 3న భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు సీఎం జ‌గ‌న్. మొదటి దశలో జీఎంఆర్ గ్రూపు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భోగాపురం ఎయిర్ పోర్టును రూపుదిద్దనున్నారు. సీఎం జగన్ మే 3వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని ఆమె జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img