Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

మోదీ, జగన్‌ వైఫల్యాలపై పోరాటాలు

విశాఖ ఉక్కు ఉద్యమం 13 జిల్లాలకు విస్తరణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక పరిపాలనా వైఫల్యాలపై స్వతంత్ర పోరాటాలకు సమాయత్తం కానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 7, 8 తేదీలలో విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ, సమితి సమావేశాలలో దేశ, రాష్ట్ర రాజకీయాలు, పార్టీ చేపట్టాల్సిన ఉద్యమాలపై సమావేశం స్పష్టమైన నిర్ణయాలు తీసుకుందనీ, పార్టీ నిర్ధిష్టంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష వైఖరి అవలం బించాలని తీర్మానిం చిందన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ పరిపాలనా విధానాలపై కలిసి వచ్చే వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులతో ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. దేశంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయన్నారు. మోదీ పాలనలో కొత్త ఉద్యో గాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని పీకేశారని, 33 శాతం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమైందని వివరిం చారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు కరోనా కష్టకాలంలో పేదలకు కొంత ఊరట నిచ్చాయేగానీ, రాష్ట్రాభివృద్ధి మాత్రం బెత్తెడు కూడా దోహదపడలేదని విశ్లేషించారు. రాష్ట్రమంతా అప్పులమయంగా మారిందని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని విమర్శించారు. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లక్షా 28 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయగా..జగన్‌ ప్రభుత్వం పోటీగా రూ.4 లక్షల కోట్లు అప్పులు తెచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, పారిశుధ్య కార్మికులకు, ఏఎన్‌ఎంలకు నెలల తరబడి వేతనాల జాప్యం జరుగుతోందని చెప్పారు. జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఒక్కో రంగం ఉద్యమాల రూపాల్లో ముందుకు వస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి అధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయని, వాటికి సీపీఐ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందన్నారు. కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దు హామీ కోసం ఉద్యోగ సంఘాలు పోరాటానికి సమాయాత్తమయ్యాయని తెలి పారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని 13 జిల్లాలకు విస్తరిం చాలని, పార్టీ చొరవతో అన్ని పట్టణాల్లో సంఫీుభావ సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తా మన్నారు. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో అశోక్‌ అనే యువకుడిని కొట్టిచంపి, అతడి శవాన్ని హడావుడీగా కాల్చి వేసిన ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని, ఎస్‌ఐను విధుల నుంచి తొలగించాలని ప్రభు త్వాన్ని డిమాండు చేశారు. వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేపట్టి నప్పటికీ ఇంతవరకు హంతకులెవరనేదీ తేలలేద న్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అంశాల వారీగా సాధన సమితులు : ముప్పాళ్ల నాగేశ్వరరావు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా పోరాటంలో భాగంగా ఆయా కేంద్రాలలో అంశాల వారీగా సాధన సమితుల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రల నిర్వహణపై సమావేశంలో నిర్ణ యించామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక పరిస్థితులు, గ్రామీణ ఉపాధి హమీ పథకం పనుల బిల్లుల చెల్లింపుపైన, యావత్తు రహదారుల అధ్వాన స్థితిగతులపై భవిష్యత్తులో ఉద్యమాల రూపంలో ప్రభుత్వంపై సీపీఐ ఒత్తిడి పెంచనుందన్నారు. ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం కాలర్‌ పట్టుకుని హోదా తెస్తానని చెప్పిన జగన్‌..నేడు కనీసం ప్రాధేయపడైనా తేలేక పోవడం వల్ల రాష్ట్రానికెంతో నష్టం చేకూరిందని చెప్పారు. విభజన హామీల ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రస్తావనే లేకుండా పోయిందని, కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం కట్టాల్సిం దిపోయి.. ఉన్న విశాఖ ఉక్కును అడ్డగోలుగా ప్రైవేటీకరణకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంపైనా నిర్లక్ష్యం చూపు తోందని, ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా సాధనా సమితుల ద్వారా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జల్లి విల్సన్‌, రావుల వెంకయ్య, అక్కినేని వనజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img