Monday, January 30, 2023
Monday, January 30, 2023

రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభపై సజ్జల చంద్రబాబు గురించి మాట్లాడుతూ, చంద్రబాబు ఏపీ వాడు కాదని, ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు తెలంగాణలోనే ఉన్నాయని సజ్జల అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని.. సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీలోనే ఉండాలనే విషయమై స్పష్టత ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని.. తెలంగాణలో ప్రజలకు సేవ చెయ్యాలంటే మంచిదని, ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదని వివరించారు.రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని..ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్ళాడని ఆగ్రహించారు. ఏమి చెయ్యాలో చంద్రబాబుకు స్పష్టత లేదని..రాష్ట్రం అన్యాయంగా విడిపోయింది సేవ చేయాలి అనే క్లారిటీ జగన్‌కు ఉందని వెల్లడిరచారు. తనతో పెట్టుకుంటే తెలంగాణలో ఉపయోగం ఉంటుందని బీజేపీకి చెప్పడమే బాబు ఉద్దేశమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఉన్నట్టుండి చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియదని.. చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img