రాజధాని పరిధిని కొన్ని గ్రామాలకే పరిమితం చేసేందుకు అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అమరావతి కోర్ కేపిటల్ ఏరియా 29 గ్రామాల్ని19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అన్యాయమని అన్నారు. అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్‌ను 19 గ్రామాలకు పరిమితం చేసి 10 గ్రామాలను వదిలేయటం సరికాదన్నారు. 29 గ్రామాలు కాకుండా 19 గ్రామాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం కోర్టు ఉల్లంఘన అవుతుందన్నారు. శ్మశానం, ఎడారి, గ్రాఫిక్స్ అని విమర్శించిన రాజధానిని ఏ విధంగా తాకట్టుపెడతారని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువ చేసే 34 వేల ఎకరాలను 29 గ్రామాల రైతులు ఉచితంగా ఇచ్చింది తాకట్టుపట్టడానికికాదని అన్నారు.