Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

రాజధాని విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం ఉండదు : రఘురామ

ఏపీ రాజధాని అంశంలో పకడ్బందీ జడ్జిమెంట్‌ వచ్చిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు..హైకోర్టు తీర్పుపై హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు సరైన విధంగా లేవని రఘురామ ఆరోపించారు.ఇక రాజధాని విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం ఉండదని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కోర్టు చెంప దెబ్బలు వేస్తోందని ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో జగన్‌ నిర్ణయం దారుణంగా ఉందన్నారు. .సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.అసెంబ్లీ రద్దు చేసి జగన్‌ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. తనను కొందరు రాష్ట్రానికి రానివ్వడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై లేఖలు రాస్తున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img