Friday, March 31, 2023
Friday, March 31, 2023

రాజు తప్పులను ప్రశ్నిస్తే రాజద్రోహమా..

ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గత కేసుల్లో మరిన్ని వివరాలు తీసుకునేందుకు రావాలన్నారని తెలిపారు. ఈ నెల 17 సీఐడీ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. తాను చట్టాలను అనుసరిస్తానని చెప్పారు. గతంలో తనను అరెస్ట్‌ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారన్నారు. తన సిబ్బందిపై, తనపైనా పై వ్యక్తి గతంగా దాడి చేశారని అని అన్నారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని తెలిపారు. ఈ రావణ రాజ్యంలో ప్రజలు విసుగుచెందారని అన్నారు. రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మండిపడ్డారు. రాజు తప్పులను ప్రశ్నిస్తే రాజద్రోహమా అని నిలదీశారు. జగన్‌రెడ్డిది ఆటవిక పాలన అని ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img