Monday, September 26, 2022
Monday, September 26, 2022

రాజ్‌ భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి చంద్రబాబు…

సీఎం జగన్‌ తో ఒకే వేదిక పంచుకోనున్న విపక్షనేత
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఏపీ రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా ఆహ్వానం అందింది. టీడీపీ విపక్షంలోకి వచ్చాక ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు వస్తుండడం ఇదే ప్రథమం. అయితే, నేడు తొలిసారిగా చంద్రబాబు స్వయంగా హాజరుకానుండడంతో అందరి దృష్టి రాజ్‌ భవన్‌ వైపు మళ్లింది. ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ సాయంత్రం రాజ్‌ భవన్‌ లో తేనీటి విందు ఇస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఢల్లీిలో మోదీతో ప్రత్యేకంగా మాట్లాడిన సమయంలోనూ మీడియా దృష్టి అటువైపే మళ్లింది. చాన్నాళ్ల తర్వాత మోదీతో చంద్రబాబు మాట్లాడిన క్షణాలను పలు పత్రికలు, ఛానళ్లు హైలైట్‌ చేశాయి. ఇప్పుడు చంద్రబాబు ఏపీ రాజ్‌ భవన్‌ లో సీఎం జగన్‌ తో కలిసి ఒకే వేదిక పంచుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img