Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

రాష్ట్రంలోని ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌ ఉండాలి

సీఎం జగన్‌
రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం… తదితర అంశాలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం వాలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలన్నారు. కాలేజ్‌, యూనివర్సిటీలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. మిషన్‌ డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌ కోసం అందరూ పనిచేయాలని చెప్పారు.మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని పోలీసులు వివరించారు. .ఇప్పటివరకూ 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. దిశ యాప్‌ ద్వారా 5238 మందికి సాయం అందించినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img