Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

రాష్ట్రంలో కరెంట్‌ కోతలపై టీడీపీ ధర్నా

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కరెంట్‌ కష్టాలు పడుతున్నారు. పల్లె , పట్టణం, నగరం అనే తేడాలేకుండా గంటల కొద్దీ కరెంట్‌ పోతుండడం..ఎప్పుడు వస్తుందో కూడా తెలియకపోవడంతో ప్రజల్లో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. కరెంట్‌ కోతల ఫై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనలు , నిరసనలు చేస్తుండగా ఈరోజు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కరెంట్‌ కోతలపై ధర్నాకు పిలుపునిచ్చింది. ‘బాదుడే బాదుడు’ నినాదాలతో తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దైవందిన్నె విద్యుత్తు ఉపకేంద్రం వద్ద తెలుగుదేశం నేతలు కొవ్వొత్తులు, లాంతర్లతో ధర్నా చేపట్టారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నంద్యాలలో డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వుత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఛార్జీలు పెంచడమే కాకుండా ఎవరికీ సమాచారం లేకుండా పవర్‌కట్‌ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నపిల్లలు మరణిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయని భూమా ఆగ్రహం వ్యక్తంచేశారు. సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని తురకలాపట్నం విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. పెనుకొండ-పావుగడ ప్రధాన రహదారిపై బైఠాయించి.. నినాదాలు చేశారు. కదిరి మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోనూ బాదుడే బాదుడు అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ..ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img