Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రాష్ట్రంలో కొత్తగా 2,058 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 పరీక్షలు నిర్వహించగా..2,058 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కాగా, నిన్నటి కంటే ఇవాళ పాజిటివ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,66,175 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా గడిచిన ఒక్క రోజులో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా రికవరీల సంఖ్య 19,31,618 లకు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా ఒక్క రోజులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,377 లకు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img