Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను గవర్నర్‌కు వివరించాం : రామకృష్ణ

సీపీఐ నేతల బృందం శుక్రవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను గవర్నర్‌కు వివరించామన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేక ఉదంతాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు చూపించామన్నారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లో వాళ్లకి అప్పగించడం దారుణమన్నారు. కేసు లేకుండా ఉండేలా డబ్బు అశ చూపారని, ఆ జిల్లా ఎస్పీ కూడా ఎమ్మెల్సీని కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ చెప్పారని రామకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img