Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా చేస్తాము : మంత్రి బాలినేని

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా చూస్తామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. విజయవాడ దేవినగర్‌ వద్ద విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో విద్యుత్‌ వాడకం పెరుగుతునందు వల్ల ఉత్పత్తి ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో విద్యుత్‌ కోతలు లేకుండా చూస్తామన్నారు. విద్యుత్‌ కోతల నివారణకు అవసరమైతే ప్రైవేట్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు అందజేస్తామన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి మంజూరైన సబ్‌ స్టేషన్లలో మూడిరటి పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకాలను తొలగించేందుకు నిధుల సమస్య రాకుండా ఆర్ధిక శాఖకు తగిన ఆదేశాలను సీఎం జగన్‌. జారీ చేసారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img